క్యాస్టింగ్ కౌచ్ కు నేను పూర్తి వ్యతిరేకం!: దర్శకుడు కొరటాల శివ

17-04-2018 Tue 17:43 | Entertainment
  • అలాంటి పనులు నా చుట్టుపక్కల కూడా జరగనివ్వను
  • చాలా సీరియస్ గా తీసుకుంటాను
  • నాపై ఆరోపణలు రావడంతో చాలా షాక్ కు గురయ్యా
  • బయటే కాదు సెట్ లోనూ అసభ్యకరమైన మాటలు మాట్లాడను
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పేరును ప్రస్తావించకుండా ఆయనపై నటి శ్రీశక్తి (శ్రీరెడ్డి) ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘భరత్ అనే నేను’ ప్రమోషన్స్ ను త్వరలోనే ప్రారంభించనున్నామని, అయితే, ఈ ప్రమోషన్స్ ప్రారంభించడానికి ముందే ఓ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలని నాకు అనిపిస్తోంది. గత వారంలో నా పేరిట కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్క్యులేటయ్యాయి.

అయితే, ‘భరత్ అనే నేను’తో ఫుల్ బిజీగా ఉన్న నేను హైదరాబాద్, ముంబై, చెన్నై తిరుగుతున్నాను. ఈ గ్యాప్ లోనే విషయాలన్నీ తెలుస్తున్నాయి. కానీ, నాపై ఓ ఆరోపణ రావడంతో కొంచెం టెన్షన్ అయితే ఉంది. గాసిప్ లాంటిది, దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నా శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ, గత వారం నుంచి మీడియా, సోషల్ మీడియా వేదికగా చాలా చర్చలు జరుగుతున్నాయి.

కాబట్టి, దీనిపై నేను వివరణ ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి నా పేరు ప్రస్తావించ లేదు కానీ, ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి కనుక వివరణ ఇచ్చుకోవాలి. క్యాస్టింగ్ కౌచ్ కు నేను వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకిని. అలాంటి పనులకు నేను పూర్తిగా వ్యతిరేకం. నా చుట్టుపక్కల కూడా అలాంటివి ఎంకరేజ్ చేయను.. చాలా సీరియస్ గా తీసుకుంటాను’ అన్నారు.

‘ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు దర్శకుడిగా పని చేశాను. చాలా మంది నటులు, టెక్నీషియన్స్ తో కలిసి పని చేశాను. వాళ్లతో చాలా గౌరవంగా ఉంటాం. ఆడవాళ్లు, మగవాళ్లని కాదు, మనిషి అనే భావనతో గౌరవంగా ఉంటాం. ‘అండి’ అని తప్ప, పేరు పెట్టి కూడా పిలవం. అలాంటిది నాపై ఆరోపణలు రావడంతో చా లా షాక్ కు గురయ్యా. న్యాయం కోసం పోరాడుతున్న మహిళలకు నేనే కాదు ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలి.

సినీ పరిశ్రమలో తప్పు జరిగితే మన ఇండస్ట్రీలో తప్పు జరిగిందనే బాధ కలుగుతుంది. నేను బయటే కాదు సెట్ లోనూ అసభ్యకరమైన మాటలు మాట్లాడను. నా సినిమాలో మహిళలను కించపరిచే విధంగా ఏ ఒక్క సీన్ కూడా ఉండదు. అంటే, మహిళల పట్ల అంత గౌరవంగా ఉంటాను’ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. 
Tollywooddirector koratala

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more