ఇలాంటి రాక్షసులలో ఎటువంటి మార్పు రావట్లేదు!: నటి రేణూ దేశాయ్ ఆవేదన

16-04-2018 Mon 22:06 | Entertainment
  • ఉన్నావో, కథువా ఘటనలపై స్పందించిన రేణూ దేశాయ్
  • ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలి
  • అప్పుడే, ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడచ్చు 
ఉన్నావో, కథువా ఘటనలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలతో పాటు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై తాజాగా నటి రేణూ దేశాయ్ స్పందించారు. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపమనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు.

 ‘అసిఫా, నిర్భయ, ఉన్నావో యువతి... వీళ్ళందరూ వివిధ వయసులకు చెందిన వారు. కులాల రీత్యా గాని ప్రాంతాల రీత్యా గాని వీరికి ఎటువంటి సంబంధం లేదు, కానీ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధితులంతా (వీరంతా) అడపిలల్లే. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపం అనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చర్యలను చేపట్టాలని ప్రముఖ లాయర్లను, ఓ ప్రఖ్యాత సామాజిక సేవా కార్యకర్తను, ఒక పోలీసు ఉన్నతాధికారిని కోరగా ..‘ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే విధంగా ఎప్పుడైతే ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పటిదాకా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ర్యాలీలు నిర్వహించినా ఎటువంటి ఉపయోగం ఉండదని’ తేల్చి చెప్పారు.

ఆడపిల్లలు/ పసిపిల్లలపైన జరుగుతున్న లైంగిక దాడులు, అకృత్యాలు నిత్యం మనం అనేకం చూస్తూనే ఉన్నాం ...ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని సోషల్ మీడియాలో, అనేక చర్చా వేదికల్లో, రోడ్లపై ర్యాలీల రూపంలో మన నిరసనను తెలుపుతూనే ఉన్నాం. అయినా ఈ ఘటనలు అగట్లేదు, ఈ చర్యలకు పాల్పడే రాక్షసులలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పుడే ఈ హృదయ విదారక ఘటనలకు చరమగీతం పాడచ్చు. అప్పటివరకు మన ఆడపిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది .. ఎందుకంటే కన్న తండ్రే తన కూతుళ్లను రేప్ చేసిన చరిత్ర మనకుంది... అందుకే మన ఆడపిల్లలకు తగిన రక్షణ కలిగిస్తూ మనం భద్రంగా కాపాడాల్సిన అవసరం మనకు ఉంది!’ అని రేణూ దేశాయ్ అన్నారు. 
Pawan Kalyanrenu desai

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more