ఎయిమ్స్ లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్'... 5 నెలలుగా డాక్టర్ గా చలామణి!

16-04-2018 Mon 12:47 | National
  • వైద్యులను బురిడీ కొట్టించిన అద్నాన్ 
  • మారధాన్ లో అతని వ్యవహార శైలిపై వైద్యులకు అనుమానం
  • పోలీసులకు ఫిర్యాదు, అరెస్టు
ఢిల్లీ ఎయిమ్స్‌ లో నకిలీ వైద్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... బీహార్ కు చెందిన అద్నాన్ ఖుర్రం (19) గత ఐదు నెలలుగా వైద్యుడిగా చలామణి అవుతున్నాడు.  ఎయిమ్స్‌ లో కొందరు వైద్యులకు తాను జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యుడినని, జూనియర్‌ రెసిడెంట్ వైద్యులకు తాను మెడికల్‌ స్టూడెంట్ నని చెబుతూ పరిచయం పెంచుకునేవాడు. ఇలా ఐదు నెలలుగా మభ్యపెడుతూ వైద్యుడిగా చలామణీ అవుతున్నాడు. ఆసుపత్రిలోని మెడికల్ విద్యార్థులు పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకునేవాడు.

ధర్నాలు, మారధాన్ లు ఇలా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. అయితే శనివారం ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన మారథాన్ సందర్భంగా కొందరు వైద్యులకు అద్నాన్ పై అనుమానం వచ్చింది. దీంతో అతనిని నిలదీయగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, మందులపై అతడికున్న అవగాహన, ఎయిమ్స్‌లో వైద్యుల పేర్లు, ఇతర విభాగాలకు సంబంధించి అతని వద్దనున్న సమాచారం చూసి షాక్ తిన్నారు.

 అయితే అతనికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని బాట్లా హౌస్‌ సమీపంలో ఉంటున్న అద్నాన్ సోషల్‌ మీడియా ఖాతాలో తెల్లకోటు, స్టెతస్కోప్‌ పట్టుకుని దిగిన చాలా ఫొటోలు ఉన్నాయని తెలిపారు. తన కుటుంబసభ్యుడొకరికి మంచి వైద్యం అందించడానికి తాను ఇలా వైద్యుడి అవతారం ఎత్తానని ఒకసారి, తనకు వైద్యులతో సమయం గడపడం చాలా ఇష్టమని మరోసారి, వైద్యుడిని కావాలని అనుకున్నానని ఇంకోసారి చెబుతూ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు వారు తెలిపారు.
aiimsNew Delhifake doctoradnan khurram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more