జీ మెయిల్ లో కళ్లు తిరిగే ఫీచర్లు త్వరలో... మెయిల్ చదవడం వరకే... కాపీ చేయలేరు, ఫార్వార్డ్ చేయలేరు!

  • ప్రింట్ కూడా తీసుకునే చాన్స్ ఉండదు
  • పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయరీ డేట్
  • మెయిల్ తెరవాలంటే పాస్ కోడ్.. ఇలా ఎన్నో ఫీచర్లు
జీమెయిల్ లో ఎన్నో కొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జీమెయిల్ కు కొత్త వెబ్ డిజైన్ ను తీసుకురానున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఫీచర్లకు సంబంధించిన ప్రణాళికలను కూడా బయటపెట్టింది. జీ మెయిల్ కు ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ ను జోడించనుంది. దీని ప్రకారం మీరు ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ను వారు మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా చేసుకోవచ్చు.

అంతేకాదు, మీరు పంపిన మెయిల్ ను కాపీ చేయడం కానీ, ప్రింట్ తీసుకునే అవకాశం కానీ ఉండదు. అలాగే, వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ సందేశం ద్వారా గూగుల్ పంపిస్తుంది. అంతేకాదు, పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ తేదీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే నిర్ణీత సమయం తర్వాత అవి డిలీట్ అయిపోతాయి.

Go Back to Shorts
google
gmail

More Telugu News