సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

16-04-2018 Mon 07:29 | Entertainment
  • 'సైరా' సినిమా గురించి స్పందించిన అనసూయ 
  • 'జైసింహా' నూరు రోజుల వేడుక 
  • శర్వానంద్ తో సాయిపల్లవి మరో చిత్రం 
  • మరో హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే

*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రంలో తాను ఒక కీలక పాత్రను పోషించనున్నట్టు వస్తున్న వార్తలను హాట్ టీవీ యాంకర్ అనసూయ ఖండించింది. ఈ విషయంలో ఆ చిత్రం యూనిట్ నుంచి ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని అనసూయ చెప్పింది. ఇటీవల 'రంగస్థలం' చిత్రంలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే.
*  నందమూరి బాలకృష్ణ నటించిన 'జైసింహా' చిత్రం ఈ నెల 21తో నూరు రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం వేడుకను నిర్వహించడానికి నిర్ణయించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మే 2న ఈ వేడుకను నిర్వహించడానికి నిర్మాత సి.కల్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం 'పడిపడి లేచే మనసు' సినిమాలో కలసి నటిస్తున్న శర్వానంద్, సాయిపల్లవి జంట త్వరలో మరో సినిమా కూడా చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. 'నీది నాది ఒక కథ' ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారట.
*  తరచూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే కథానాయిక రాధికా ఆప్టే తాజాగా మరో హాలీవుడ్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే స్పై డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రాధిక గూఢచారిగా నటిస్తుంది. గతంలో తెలుగులో 'లెజండ్' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.       
Anasuyachiranjivibalakrishna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more