'ఉన్నావో' ఘటనపై ప్రభుత్వం, పోలీసులకు అక్షింతలు వేసిన అలహాబాద్ హైకోర్టు
- 'ఉన్నావో' అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అలహాబాద్ హైకోర్టు
- యూపీలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది
- ఆరు నెలలుగా కేసు ఎందుకు నమోదు చేయలేదు?
అదే సమయంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్లు తగిన ఆధారాలు లేవని వాదించారు. ఈ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతి దానికీ ఆధారాలు కావాలా? ఆధారాలు లేకపోతే కేసులు నమోదు చేయరా? యువతికి అన్యాయం జరిగినప్పుడు పోలీసుల వద్దకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? అంటూ నిలదీసింది.