ఆ సీన్లు, డైలాగులు ఎందుకు తీసేయాలి?: మండిపడ్డ ఆర్‌.నారాయణ మూర్తి

11-04-2018 Wed 17:33 | Entertainment
  • విడుదలకు సిద్ధమవుతోన్న ‘అన్నదాత సుఖీభవ’
  • ఆర్‌.నారాయణ మూర్తి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా
  • ముఖ్య సీన్లకు కట్స్ చెప్పిన సెన్సార్ 
సెన్సార్ అధికారుల తీరుపై సినీనటుడు ఆర్‌.నారాయణ మూర్తి మండిపడ్డారు. రైతులు, సమాజంలో పీడిత వర్గాల సమస్యలే ప్రధానాంశాలుగా ఆయన సినిమాలు తీస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ‘అన్నదాత సుఖీభవ’ అనే సినిమాలో నటించారు. అయితే, ఈ సినిమాని సెన్సార్ కోసం పంపగా, అందులోని కొన్ని సీన్లకు సెన్సార్ కట్స్ చెప్పింది. ప్రధానంగా ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు కానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు’ అనే డైలాగుతో కూడిన సీనుని తీసేయాలని చెప్పడంతో నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాను రైతుల సమస్యలే ఇతివృత్తంగా ఈ సినిమా తీశానని, సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన సీన్లను తొలగించమని సెన్సార్ వారు అంటున్నారని ఆర్‌.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రజల ఆవేదనను తెలియజెప్పాలని చూడడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఏం పాపం చేశారు? పారిశ్రామిక వేత్తలు ఏం పుణ్యం చేశారు? అని అన్నారు. కోట్లాది రూపాయలు మోసం చేసి కొందరు పారిపోతున్నారని, రైతులను ఆదుకోవాలని సీన్లు తీయడం తప్పా? అని అడిగారు. భారత ప్రజలు కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేయడానికా? అని ప్రశ్నించారు. తాను సెన్సార్ బోర్డు నిర్ణ‌యంపై పునర్విచారణ క‌మిటీ వద్దకు వెళతానని అన్నారు.   
r narayana murthysukhibhavafire

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more