'అత్తారింటికి దారేది' తరువాత మళ్లీ రామ్ మూవీకి ఓకే చెప్పింది!

11-04-2018 Wed 10:43 | Entertainment
  • త్రినాథరావు దర్శకత్వంలో రామ్ 
  • ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • మరో కథానాయికగా ప్రణీత  
తెలుగు తెరపై అల్లు అర్జున్ తరువాత అంత జోష్ తో కథను పరుగులు తీయించే హీరోగా రామ్ కనిపిస్తాడు. అలాంటి రామ్ కి 'నేను శైలజ' తరువాత ఆ స్థాయి హిట్ పడలేదు. దాంతో ఆయన చెప్పుకోదగిన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన త్రినాథరావు నక్కినకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పూర్తి వినోదభరితంగా కొనసాగే ఈ ప్రేమకథకి 'హలో గురు ప్రేమకోసమే' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.

 ఈ సినిమాలో ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా ప్రణీతను తీసుకున్నారనేది తాజా సమాచారం. 'అత్తారింటికి దారేది' సినిమాతో హిట్ పడినప్పటికీ ఈ సుందరి పెద్దగా సినిమాలను అంగీకరించలేదు. ఈ సినిమాలో తన పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో ఓకే చెప్పేసిందని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు .  
ramanupama

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more