కొంప ముంచిన యువతి ఫేస్ బుక్ ఛాటింగ్.. తండ్రికి బెదిరింపులు!
- ఫేస్ బుక్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఛాట్ చేసిన యువతి
- పెళ్లి చేసుకుంటాననడంతో నగ్న చిత్రాలు పంపిన యువతి
- ఫోటోలతో యువతి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు
కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తులో నిందితుడు గుర్గావ్ కు చెందిన దేవేంద్రసింగ్ (25) గా గుర్తించారు. అతను జైపూర్ లోని ఎంఎన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ, ఫేస్ బుక్ ద్వారా బాధితుడి కూతురిని పరిచయం చేసుకున్నాడని నిర్ధారించుకున్నారు. తొలుత బాగా మాట్లాడి, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, ఆమె నగ్న చిత్రాలు సంపాదించాడని గుర్తించారు. ఇవేవీ తెలియని కుటుంబ సభ్యులు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారని, దీంతో ఆ నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించాడని వెల్లడించారు. దీంతో గుర్గావ్ వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కాగా, అతను ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు.