కోదండరామ్ నేతృత్వంలో కొత్త‌ రాజకీయ పార్టీ.. పేరు ప్రకట‌న‌కు ముహూర్తం ఖరారు!
Add ap7am to your home Screen

కోదండరామ్ నేతృత్వంలో కొత్త‌ రాజకీయ పార్టీ.. పేరు ప్రకట‌న‌కు ముహూర్తం ఖరారు!

  • తెలంగాణ జన సమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం?
  • పార్టీ పేరు అధికారికంగా ప్రకటించనున్న కోదండరామ్‌
  • వ‌చ్చేనెల‌ 2న పార్టీ పేరు ప్రకటన
తెలంగాణ‌లో మ‌రో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ ఉద్య‌మ పోరాట యోధుడు, టీజేఏసీ ఛైర్మ‌న్‌ కోదండరామ్ నేతృత్వంలోని ఈ పార్టీకి 'తెలంగాణ జన సమితి' అనే పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. వ‌చ్చేనెల‌ 2న కోదండరామ్ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి అధికారికంగా పార్టీ పేరు ప్రకటించి, త‌మ విధి విధానాల‌ను ప్ర‌క‌టించ‌నున్నట్లు సమాచారం. ఈ బ‌హిరంగ స‌భ హైద‌రాబాద్ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్‌ స్టేడియంలలో ఏదైనా ఒకచోట ఉంటుంద‌ని తెలిసింది. ఇందుకోసం ఇప్ప‌టికే కోదండ‌రామ్ పోలీసుల అనుమతి కోరారు. కోదండ‌రామ్ పార్టీ జెండా, ఎజెండాల‌ను అదే రోజున ప్ర‌క‌టించ‌నున్నారు.
Telangana
Kodandaram
tjac

More Telugu News