అందరి కళ్లూ ఆసీస్ పైనే..నేటి నుంచే నాలుగో టెస్టు
Add ap7am to your home Screen

అందరి కళ్లూ ఆసీస్ పైనే..నేటి నుంచే నాలుగో టెస్టు

  • నేటి నుంచే ఆసీస్, సఫారీల మధ్య చివరి టెస్టు
  • వాండరర్స్ వేదికగా ఆడనున్న రెండు జట్లు
  • విజయంపై కన్నేసిన ప్రొటీస్
బాల్ టాంపరింగ్ వివాదం అనంతరం ఆస్ట్రేలియా-సౌత్ ఆఫ్రికా దేశాల క్రికెట్ జట్ల మధ్య నాలుగో టెస్టు నేడు ప్రారంభం కానుంది. చివరిదైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే రెండు టెస్టులో ఓడి, ఒక టెస్టు గెలుచుకుని సిరీస్ ఆధిక్యం కోల్పోయిన ఆసీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లపై వేటుపడడం ఆ జట్టును మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.

దీంతో ఈ మ్యాచ్ లో ఆసీస్ ఎలాంటి ప్రదర్శన చేయనుందోనంటూ అభిమానుల కళ్లన్నీ చివరి టెస్టుపైనే ఉన్నాయి. వాండరర్స్‌ స్టేడియం వేదికగా, నేటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ లో నెగ్గితే, ఆస్ట్రేలియా జట్టుపై స్వదేశంలో సిరీస్‌ గెలుచుకోవడం సఫారీ జట్టుకు ఇదే తొలిసారి కానుంది. దీంతో ప్రోటీస్ ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించనున్నారు. 
Cricket
4th test
Australia
south africa

More Telugu News