నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్ డేషన్

  • నోకియా 5, 6 మోడళ్లకు ముందు అవకాశం
  • ఓరియోతో పలు నూతన ఫీచర్లు
  • నోకియా 2, 3 మోడళ్లకూ త్వరలోనే అప్ డేషన్
నోకియా 5, నోకియా 6 మోడల్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు శుభవార్త. ప్రస్తుతం ఇవి ఆండ్రాయిడ్ నౌగత్ ఓఎస్ పై పనిచేస్తుండగా, వీటికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియా అప్ డేషన్ కు కంపెనీ అవకాశం కల్పించింది. భారత్ సహా పలు దేశాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నూతన ఓఎస్ కు మారిపోవడం వల్ల న్యూట్రల్ నెట్ వర్క్స్ ఏపీఐ, హమ్ బర్గర్ ఎమోజీ ఫిక్స్, డెవలపర్ ఏపీఐలు వంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

అంతేకాదు బ్యాటరీ సేవింగ్ నేవిగేషన్ బటన్లు కూడా వస్తాయి. ఇక నోకియా 2, 3 మోడల్ ఫోన్లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్ డేషన్ కు అవకాశం కల్పించనున్నట్టు నోకియా తెలిపింది. నూతన ఓఎస్ కు అప్ డేట్ అయ్యేందుకు సెట్టింగ్స్ లో ఎబౌట్ ఫోన్ కు వెళ్లి అప్ డేట్ సాఫ్ట్ వేర్ ను సెలక్ట్ చేసుకోవాలి. 

nokia
android oreo updation

More Telugu News