నకిలీ నోట్ల చలామణిలో నరేంద్ర మోదీ రాష్ట్రమే ఫస్ట్!
- నకిలీ కరెన్సీ చలామణిలో గుజరాత్ ఫస్ట్
- రెండో స్థానంలో మిజోరాం
- గుజరాత్ లోని పెద్ద నగరాల్లో నకిలీ నోట్ల ప్రింటింగ్
2017 జనవరి నుంచి 2018 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా రూ. 6.77 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. ఇందులో 34 శాతం అంటే రూ. 2.31 కోట్ల నకిలీ నోట్లను గుజరాత్ లోనే స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.23 కోట్ల సీజ్ తో మిజోరాం రెండో స్థానంలో ఉంది. గుజరాత్ లోని పెద్ద నగరాల్లో నకిలీ నోట్లను ముద్రిస్తున్నారని... అక్కడ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలకు సరఫరా చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.