ప్రత్యేక హోదా రావడం లేటు కావచ్చు కానీ, రావడం మాత్రం పక్కా: ఏపీసీసీ ఉపాధ్యక్షుడు

27-03-2018 Tue 13:44 | Andhra
  • ఏపీకి రూ.5 లక్షల కోట్లు లబ్ది చేకూర్చే విధంగా విభజన సమయంలో చేశాం
  • బీజేపీ అధికారంలోకి రావడంతో ఎపీ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి
  • మోదీ మోసగారితనం, చంద్రబాబు చేతకానితనం రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నాయి 
ప్రత్యేక హోదా రావడం లేటు కావచ్చు కాని రావడం మాత్రం పక్కా అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తుల‌సి రెడ్డి అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి రూ.5 లక్షల కోట్లు లబ్ది చేకూర్చే విధంగా విభజన స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ చేసింద‌ని కానీ, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఎపీ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్ర‌ధాని మోదీ మోసగారితనం, ఏపీ సీఎం చంద్రబాబు చేతకానితనం, వైసీపీ అధినేత‌ జగన్ అవకాశవాదం రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రజల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక‌ హోదా కోసం తాము మాత్ర‌మే పని చేస్తున్నామ‌ని మ‌భ్య‌పెట్టేందుకు చంద్రబాబు, జగన్ ప్రయత్నిస్తున్నారని తులసి రెడ్డి అన్నారు. టీడీపీ నిర్వహిస్తోన్న అఖిలపక్ష భేటీ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రావని తెలిసి జగన్ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా రావటం తథ్య‌మ‌ని, అది కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ, జనసేన రాష్ట్ర ప్రజలను సెంటిమెంట్ తో మోసం చేస్తున్నాయని విమ‌ర్శించారు.  
CongressSpecial Category Statustulasi reddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more