ట్రిలియన్ డాలర్లకు ఏపీ ఆర్థిక వ్యవస్థ: మంత్రి లోకేశ్
- ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ వాటా 20 శాతం
- తిరుపతిలో 150 ఎకరాల్లో రిలయన్స్ పార్క్
- ఒకే చోట లక్షమంది పనిచేసేలా కార్యాచరణ
ఒకే చోట లక్షమంది పనిచేసేలా ఫ్యాక్టరీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి లోకేశ్ తెలిపారు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాయలసీమను తయారీ హబ్‌గా మారుస్తామన్నారు. అనంతపురానికి ఇప్పటికే కియా కార్ల కంపెనీ వచ్చినట్టు చెప్పారు. అలాగే హెచ్‌సీఎల్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు లోకేశ్ వివరించారు.