మంత్రి అచ్నెన్నాయుడు అవాకులు చెవాకులు పేలుతున్నారు : కాంగ్రెస్ నేత గంగాధ‌ర్

25-03-2018 Sun 18:30 | Both States
  • కాంగ్రెస్ పాల‌న‌లో బీసీల‌ను అణచివేశార‌నడం కరెక్టు కాదు
  • అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  • బీసీ ఉప ప్రణాళిక పేరిట టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోంది
  • టీడీపీకి బీసీలు త‌గిన గుణ‌సాఠం చెబుతార‌ు 
అవాకులు చెవాకులు పేల‌డం మంత్రి అచ్చెన్నాయుడుకు వెన్న‌తో పెట్టిన విద్యే అని కాంగ్రెస్ పార్టీ నేత గంగాధర్ విమర్శించారు. ఈ మేర‌కు ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో బీసీల‌ను ఉక్కుపాదంతో అణిచివేశార‌ని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీల‌కు స‌మ‌గ్రంగా, చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయంగా ఏదైనా జ‌రిగిందంటే అది కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యంలోనే అని అన్నారు. బీసీలకు టీడీపీ ఎంతో చేసిందని అచ్చెన్నాయుడు మోసపు మాటలు చెబుతున్నారని, బీసీ ఉప ప్రణాళిక పేరుతో టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు బీసీలపై చిత్త‌శుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ కు కాంగ్రెస్ చ‌ట్ట‌బ‌ద్ధత క‌ల్పించిన విధంగా బీసీ ఉప ప్ర‌ణాళిక‌కూ చ‌ట్ట‌బ‌ద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.  

బీసీల‌కు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ కాంగ్రెస్ హ‌యాంలోనే జ‌రిగిన విషయాన్ని ప్రస్తావించారు.
టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్  ఇవ్వ‌కుండా నిబంధనల పేరుతో విద్యార్థులు చ‌దువుకునే అవ‌కాశం లేకుండా చేశారని విమర్శించారు.
1972లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, రాజీవ్‌గాంధీ హ‌యాంలో 73, 74 రాజ్యాంగ స‌వ‌ర‌ణల ద్వారా స్థానిక సంస్థ‌ల‌లో బీసీల‌కు రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది కూడా తమ పార్టీయేనని, అది అమ‌లు జ‌రిగే స‌మ‌యంలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ క్రెడిట్ టీడీపీకి ద‌క్కింద‌ని అన్నారు. 1992లో ఉద్యోగుల‌కు ఓబీసీ రిజ్వరేష‌న్ క‌ల్పించింది, 2007లో ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ఓబీసీ రిజ్వ‌రేష‌న్ కేంద్ర‌ స్థాయిలో క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ హ‌యాంలో బీసీల‌కు 44 శాతం రిజ‌ర్వేషన్ కల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంటే , అందుకు వ్య‌తిరేకంగా అంద‌రినీ రెచ్చ‌గొట్టి అందోళ‌న‌లు నిర్వ‌హించి, అమ‌లు జ‌ర‌గ‌కుండా చేసింది చంద్ర‌బాబునాయడేనని విమర్శించారు. వాస్త‌వాలను పక్కన పెట్టి తన నోటికొచ్చినట్టు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విష‌యాల‌ను అర్థం చేసుకున్న బీసీలు టీడీపీకి త‌గిన స‌మ‌యంలోగుణ‌పాఠం చెబుతార‌ని అన్నారు.
CongressgangadharTelugudesamatchanaidu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more