విజయ్ మాల్యాకు ఓ న్యాయం? విజయసాయిరెడ్డికి మరో న్యాయమా? : సీఎం చంద్రబాబు

25-03-2018 Sun 14:57 | Both States
  • వీళ్లిద్దరూ ఆర్థిక నేరస్థులే .. వారి మధ్య వ్యత్యాసమేమీ లేదు!
  • టీడీపీపై కావాలని చెప్పే బీజేపీ నేతల ఆరోపణలు
  • ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు?
  • కేంద్రంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు
విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు, విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉంటున్నారని, వీళ్లిద్దరి మధ్య వ్యత్యాసం ఏముంది? అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాజకీయ పరిణామాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్రచార సారథులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, వీళ్లిద్దరూ ఆర్థిక నేరస్థులేనని, వారి మధ్య వ్యత్యాసమేమీ లేదని, మరి, అలాంటప్పుడు విజయ్ మాల్యాకు ఓ న్యాయం? విజయసాయిరెడ్డికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. మాల్యా సభ్యత్వం రద్దు చేశారని, విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీపై కావాలని చెప్పే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  

బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించాలని సూచించారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో అంశాలను అమలు చేయమని కోరితే, బీజేపీకి ఎందుకు అంత కోపం వస్తోంది? రాష్ట్రం కోసం పోరాడుతున్న తమపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? అని చంద్రబాబు ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా, ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు.

‘ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా? లేక రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా? ప్రజల హక్కుల కోసం పోరాడే టీడీపీ పక్షాన ఉంటారా? లేక ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేసిన బీజేపీ వైపు ఉంటారా? అనే విషయాన్ని ఆయా పార్టీల నేతలే తేల్చుకోవాలి. టీడీపీకి మద్దతు ఇస్తే రాష్ట్రానికి మద్దతు ఇచ్చినట్టే’ అని చంద్రబాబు అన్నారు.
Chandrababuteleconference

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more