అవును.. బాల్ ట్యాంపరింగ్ చేశాం.. నిర్లజ్జగా అంగీకరించిన ఆస్ట్రేలియా
- దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్
- టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్
- ఆసీస్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్న క్రికెటర్లు
- బాన్‌క్రాఫ్ట్‌పై ఐసీసీ నిషేధం.. మ్యాచ్ ఫీజులో కోత
బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెటర్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. డేల్ స్టెయిన్, షేన్‌వార్న్, ఆడమ్ కోలిన్స్, సిమన్ హార్మర్ వంటి వాళ్లు ఆసీస్ తీరును ఎండగట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక ఇరుక్కుపోయిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ రంగంలోకి దిగాడు. బాల్‌ను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టు నిర్లజ్జగా అంగీకరించాడు. దీంతో స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బాన్‌క్రాఫ్ట్‌పై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించింది.