ప్రపంచ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్

  • 43 వన్డేల్లో 99 వికెట్లు తీసిన రషీద్
  • మరో వికెట్ తీస్తే ప్రపంచ రికార్డు సొంతం
  • 52 వన్డేల్లో 100 వికెట్లు తీసిన స్టార్క్
ఆఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ప్రపంచ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. కేవలం 43 వన్డేల్లో ఏకంగా 99 వికెట్లు తీసుకున్నాడు. మరో వికెట్ సాధిస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కనున్నాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బాౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు. రేపు వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో రషీద్ ఒక్క వికెట్ తీస్తే ప్రపంచ రికార్డు అతని సొంతమవుతుంది. గత ఏడాది జూన్ లో సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ 18 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టడం విశేషం. 
Go Back to Shorts
rasheed
afghanistan
cricketer
world record

More Telugu News