శివప్రసాద్ మేకప్ వేసుకుంటున్నాడు... చంద్రబాబు వేసుకోవడం లేదు... మిగతా అంతా సేమ్ టూ సేమ్: అంబటి రాంబాబు ఎద్దేవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శివప్రసాద్ మేకప్ వేసుకుంటున్నాడు... చంద్రబాబు వేసుకోవడం లేదు... మిగతా అంతా సేమ్ టూ సేమ్: అంబటి రాంబాబు ఎద్దేవా

  • ప్రత్యేక హోదాపై చంద్రబాబుది పూటకోమాట
  • రాజకీయాల్లో నంబర్ వన్ ద్రోహి చంద్రబాబే
  • ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు
  • వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
రోజుకో రకం వేషంతో మేకప్ వేసుకుని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ కు వస్తుంటే, చంద్రబాబునాయుడు మేకప్ వేసుకోకుండా రోజుకో వేషం వేస్తూ, పూటకో మాట మాట్లాడుతున్నారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ ఉదయం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక్క మేకప్ విషయంలో తప్ప శివప్రసాద్, చంద్రబాబులది ఒకే వైఖరని అన్నారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారని, దేశ రాజకీయాల్లో నంబర్ వన్ ద్రోహి చంద్రబాబేనని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కబోవని హెచ్చరించారు. పాత మిత్రులు దూరం కావడంతో ఏమీ తోచని స్థితిలో ఉన్న చంద్రబాబు, కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతూ, కాంగ్రెస్ తో కలసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.

2014 ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుందామని తమ పార్టీని బీజేపీ అడిగిందని, తాము కాదని చెప్పిన తరువాతే టీడీపీతో కలిసిందని అంబటి రాంబాబు తెలిపారు. బీజేపీ నేతలకు, పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎలాంటివారన్న విషయం ఇప్పటికైనా అర్థమైందని వ్యాఖ్యానించారు.
Ambati Rambabu
YSRCP
Siva Prasad
Chandrababu

More Telugu News