చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే: విజయసాయిరెడ్డి
- రంగులు మార్చడంలో చంద్రబాబు దిట్ట
- తన నీడను తానే నమ్మలేరు
- చిత్తశుద్ధి ఉంటే వైసీపీతో కలసి రావాలి
చంద్రబాబులాంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమని విజయసాయి అన్నారు. చంద్రబాబు వల్ల ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని, ప్రధాని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్నారని... రంగులు మార్చే నైజం చంద్రబాబుది కాబట్టే మోదీ ఆయనను విశ్వసించలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... వైసీపీతో కలసి రావాలని చెప్పారు. వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.