కోరిన వెంటనే మొబైల్ నెట్ వర్క్ మార్చుకునే అవకాశం... త్వరలోనే!
- ప్రస్తుతం పోర్టింగ్ కు ఏడు రోజుల సమయం
- దీన్ని సాధ్యమైనంత తగ్గించాలనుకుంటున్న ట్రాయ్
- అంతర్జాతీయంగా గంటల్లోనే పూర్తవుతున్న వైనం
ప్రస్తుతం అంతర్జాతీయంగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ అన్నది గంటల వ్యవధిలోనే పూర్తయిపోతుంది. మన దగ్గర ఏడు రోజులుగా ఉండడంతో దీన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించాలన్నది ట్రాయ్ యోచన. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని ఈ నెల చివరిలోగా విడుదల చేయనున్నట్టు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. అలాగే, ఈ ప్రక్రియను సులభంగా మార్చనున్నట్టు చెప్పారు. సమీక్షలో భాగంగా ఎంఎన్ పీని వేగతరం చేయడంపై టెలికం కంపెనీల అభిప్రాయాలను కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకోనుంది.