'జగదేకవీరుడు అతిలోకసుందరి' రిలీజ్ తేదీనే 'మహానటి' విడుదల...!
- మే 9న విడుదల కానున్న 'మహానటి' చిత్రం
- మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా అదే రోజే విడుదల
- బ్యాలెన్స్ సీన్ల షూటింగ్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీ
టైటిల్ రోల్‌ను హీరోయిన్ కీర్తి సురేష్ పోషిస్తుండగా సమంత, దుల్ఖర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, అవసరాల శ్రీనివాస్, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర తారాగణం. మరో ముఖ్య విశేషమేమిటంటే, ఇందులో ఏఎన్ఆర్ పాత్రను ఆయన మనవడు, యువ హీరో నాగ చైతన్య పోషిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ బాణీలు సమకూర్చారు.