వివాదంలో చిక్కుకున్న చరణ్ 'రంగస్థలం'
- వివాదానికి కారణమైన పాట
- 'గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే' అనే లిరిక్స్ పై యాదవుల ఆగ్రహం
- వెంటనే తొలగించకపోతే.. సినిమాను అడ్డుకుంటామంటూ హెచ్చరిక
ఈ లిరిక్స్ యాదవ మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఆ లిరిక్స్ ను వెంటనే తొలగించకపోతే... సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ వివాదంపై ఇంతవరకు చిత్ర యూనిట్ స్పందించలేదు.