కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ను నిరసిస్తూ దీక్షకు దిగనున్న ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి, సంపత్
Add ap7am to your home Screen

కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ను నిరసిస్తూ దీక్షకు దిగనున్న ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి, సంపత్

  • గాంధీ భవన్ వేదికగా 48 గంటల దీక్ష చేపట్టనున్న ఎమ్మెల్యేలు
  • ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న దీక్ష
  • కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ను ఖండించిన  ఏఐసీసీ
తెలంగాణ అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లు నిరసనకు దిగనున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా 48 గంటల దీక్ష చేపట్టనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తమ దీక్షను ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

కాగా, స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఏఐసీసీ ఖండించింది. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని, స్వామిగౌడ్ పై దాడి దృశ్యాలను మీడియా ముందు ఎందుకు ఉంచడం లేదంటూ ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
Congress
komati reddy

More Telugu News