నా కాలికీ గాయమైంది... 200 మంది మార్షల్స్ తో కొట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?: కోమటిరెడ్డి

12-03-2018 Mon 12:50 | Both States
  • సభ ప్రారంభానికి ముందే మార్షల్స్ ను రంగంలోకి దించారు
  • నా కాలికి ఎక్స్ రే తీయించి చూసుకోవాలి
  • ఎమ్మెల్యే రామ్మోహన్ కూ గాయాలు
  • అప్పట్లో నరసింహన్ ను హరీశ్ రావు గాయపరిచారు
  • మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందే 200 మంది మార్షల్స్ ను రంగంలోకి దించిన తెలంగాణ ప్రభుత్వం తాము శాంతియుతంగా తెలియజేయాలనుకున్న నిరసనలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మార్షల్స్ తమను అడ్డుకుని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన, వారిని అడ్డుకునేందుకే తాను హెడ్ ఫోన్స్ ను విసిరానని తెలిపారు. మార్షల్స్ తన కాలికి గాయం చేశారని, ఏం జరిగిందన్న సంగతి, తాను ఎక్స్ రే తీయించి చూసుకోవాల్సి వుందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ కూ గాయాలు అయ్యాయని అన్నారు. పార్లమెంట్ లో నిత్యమూ పోడియంలోకి టీఆర్ఎస్ ఎంపీలు వెళుతున్నారని గుర్తు చేసిన ఆయన, అసెంబ్లీలో మాత్రం తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర కోసం తాము ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రభసను గుర్తు చేసిన కోమటిరెడ్డి, నాడు ఓ పెద్ద పుస్తకాన్ని గవర్నర్ పైకి హరీశ్ రావు విసిరేశారని, అప్పట్లో నరసింహన్ కు గాయాలయ్యాయని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు. టీఆర్ఎస్ బెదిరింపులకు లొంగేది లేదని కోమటిరెడ్డి అన్నారు.
TelanganaAssemblyKomatireddy VenkatareddyMarshals

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more