‘రాముుడు రాముడా..రామనారాయణుడా’ అంటూ భద్రాద్రి లో శైవ క్షేత్ర పీఠాధిపతి అరుపులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘రాముుడు రాముడా..రామనారాయణుడా’ అంటూ భద్రాద్రి లో శైవ క్షేత్ర పీఠాధిపతి అరుపులు

  • భద్రాద్రి రాముడి దర్శనానికి వెళ్లిన అమరావతి శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి
  • తన శిష్యులతో కలిసి గర్భగుడిలో కూర్చుండిపోయిన పీఠాధిపతి
  • గంటపాటు నిలిచిపోయిన దర్శనాలు.. భక్తుల ఇబ్బంది
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరావతి శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి భద్రాద్రి రాముడిని దర్శించుకునేందుకు వెళ్లారు. గర్భగుడిలోకి వెళ్లిన ఆయన, ‘రాముుడు రాముడా..రామనారాయణుడా’ అంటూ బిగ్గరగా అరుస్తూ, తన శిష్యులతో కలిసి గర్భగుడిలో కూర్చుండిపోయారు. దీంతో, ఆలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటనపై ఆలయ అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, స్వామి వారు గర్భగుడిలో కూర్చుండిపోవడంతో దర్శనార్థం భద్రాద్రికి వచ్చిన భక్తులు చాలా సేపు క్యూ లైన్లలోనే నిలబడిపోవాల్సి వచ్చింది. సుమారు గంటపాటు దర్శనం నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. 
bhardracharlam
siva sami

More Telugu News