'ఇందులో నిజం లేదు.. తప్పుడు వార్తలు'.. మహేశ్‌ బాబుతో తన కొత్త సినిమా కాపీ వార్తలపై వంశీ పైడిపల్లి స్పందన
Add ap7am to your home Screen

'ఇందులో నిజం లేదు.. తప్పుడు వార్తలు'.. మహేశ్‌ బాబుతో తన కొత్త సినిమా కాపీ వార్తలపై వంశీ పైడిపల్లి స్పందన

  • ఆ సినిమా కథను ఓ ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారంటూ వార్తలు
  • ట్విట్టర్‌లో స్పష్టతనిచ్చిన దర్శకుడు
  • తన కొత్త సినిమా ఏ సిరీస్‌, సినిమా స్ఫూర్తితోనూ తీయడం లేదన్న వంశీ పైడిపల్లి
దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు త్వరలోనే ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా కథను ఓ ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారని వస్తోన్న వార్తలను వంశీ పైడిపల్లి ఖండించారు. ఇందులో నిజం లేదని, అవి తప్పుడు వార్తలని, తన కొత్త సినిమా ఏ సిరీస్‌, సినిమా స్ఫూర్తితోనూ తీయడం లేదని స్పష్టతనిచ్చారు.

తాను తీస్తోన్న మహేశ్‌ 25వ సినిమా కథను ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారంటూ న్యూజిలాండ్‌ రచయిత ఒకరు ఈ వార్త రాశారంటూ ఓ అభిమాని వంశీ పైడిపల్లికి ట్వీట్‌ చేయడంతో సదరు దర్శకుడు ఇలా స్పందించారు. కాగా మహేశ్‌ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించనున్నారు. 
vamshi paidypalli
Mahesh Babu
Bharath Ane Nenu

More Telugu News