ఫ్యాన్సీ నెంబరుపై మోజుతో లక్షలు వెచ్చించిన మలయాళ హీరో...!

  • KL 07 CN 1 నెంబరును ఏడు లక్షలకు దక్కించుకున్న మలయాళ హీరో
  • ఎర్నాకుళం ఆర్‌టీఓలో పదివేల రూపాయలతో మొదలైన వేలంపాట
  • కారు ధర సుమారు రూ.3.25 కోట్లు..!
మలయాళంతో పాటు తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్. తాను గతేడాది లంబోర్గిని హరికేన్ కారును కొనుగోలు చేశాడు. ఇంత హై ఎండ్ కారుకి మంచి ఫ్యాన్సీ నెంబరు కావాలని ముచ్చటపడిన అతను వేలంపాటలో ఏకంగా 7 లక్షలు వెచ్చించాడు. తద్వారా తనకున్న ఫ్యాన్సీ నెంబరు మోజును తీర్చుకున్నాడు. ఎర్నాకుళం ఆర్‌టీఓ కార్యాలయంలో ఇటీవల KL 07 CN 1 అనే నెంబరును వేలానికి ఉంచారు. ఈ నెంబర్ కోసం వేలంపాట రూ.10 వేల వద్ద ప్రారంభమయింది. చివరకి రూ.7 లక్షల వద్ద పృథ్వీరాజ్ దీనిని సొంతం చేసుకున్నాడు.

ఈ లంబోర్గిని కారు ధర సుమారు రూ.3.25 కోట్లు. 2010లో విడుదలయిన 'విలన్' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ భర్తగా అతను నటించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌టీఓలు వేలంపాటల్లో ఫ్యాన్సీ నెంబర్లను విక్రయించడం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. మరికొందరు సినిమా స్టార్లు తమకున్న కార్లన్నింటిపైనా ఒకే నెంబరును వాడుతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తనకున్న అన్ని కార్లపై 4545 నెంబరు ప్లేటును వాడుతున్నాడు. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కార్లపై 2727 నెంబరును ఉపయోగిస్తుండటం ఫ్యాన్సీ నెంబర్లపై వారికున్న మోజును తెలియజేస్తుంది.
Go Back to Shorts
Prithviraj
Lamborgini
Fancy number
RTO

More Telugu News