విద్యాబాలన్ హిట్ మూవీ రీమేక్ లో జ్యోతిక!
Add ap7am to your home Screen

విద్యాబాలన్ హిట్ మూవీ రీమేక్ లో జ్యోతిక!

  • హిందీలో హిట్ కొట్టిన 'తుమ్హారి సులు' 
  • తమిళ రీమేక్ కి రంగం సిద్ధం 
  • ప్రధాన పాత్రలో జ్యోతిక
హిందీలో కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయాలంటే, ఎవరికైనా సరే ముందుగా విద్యాబాలన్ గుర్తుకు వస్తుంది. ఎంతటి బలమైన కథనైనా ఆమె అవలీలగా ముందుకు తీసుకెళుతుంది. అలా ఆమె చేసిన కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో 'తుమ్హారి సులు' ఒకటి. క్రితం ఏడాది వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాను తమిళంలో జ్యోతిక రీమేక్ చేసే అవకాశాలు వున్నాయనే వార్త ఒకటి ఇటీవల షికారు చేసింది. హిందీలో విద్యాబాలన్ చేసిన పాత్రను పోషించడానికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది తాజా సమాచారం. రాధామోహన్ దర్శకత్వంలో మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే నమ్మకంతో జ్యోతిక వున్నారు.    
jyothika
vidya balan

More Telugu News