తుపాకీ పట్టుకుని వ్యానులో వచ్చి.. ట్రంప్ నివాసంలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిన మహిళ
- వైట్ హౌస్ తనదేనని, డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే భర్త అని విచిత్ర వ్యాఖ్యలు
- అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- ఆమె ఆరోగ్యంగానే ఉందని కోర్టుకు చెప్పిన న్యాయవాది
ఆమె ఇలా ప్రవర్తించడం మొదటి సారి కాదని, గతంలో కూడా ఓ సారి వైట్ హౌస్‌లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిందని వివరించారు. వైట్ హౌస్ తనదేనని, డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే భర్త అని విచిత్ర వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. తన పిల్లలు కనిపించకుండా పోయారని, తన పిల్లలను వెతికి పెట్టాలని ఆమె అంటోందని తెలిపారు.
ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఆమెకు కొన్ని రోజులు కౌన్సిలింగ్ ఇచ్చామని, అయినప్పటికీ ఆమె మారలేదని పోలీసులు అన్నారు.