అప్పులు తీర్చడం కోసమే హైదరాబాద్ వచ్చాను: 'జబర్దస్త్' గెటప్ శీను
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పులు తీర్చడం కోసమే హైదరాబాద్ వచ్చాను: 'జబర్దస్త్' గెటప్ శీను

  • అమ్మానాన్నలకు ఏమీ తెలియదు
  • నా చదువు మధ్యలో ఆగిపోయింది  
  • ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను
'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా గెటప్ శీనుకి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన మరొకొన్ని షోస్ చేస్తూ బిజీ అయ్యాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన ఫ్యామిలీని గురించి ప్రస్తావించాడు. "మా అమ్మానాన్నలకు ఇండస్ట్రీ అంటే ఏమిటి? .. సినిమాలంటే ఏమిటి? అనేది తెలియదు. వ్యవసాయము .. ఊరే వాళ్ల ప్రపంచం" అన్నాడు.

"ఇక సినిమాల గురించి మా అన్నయ్యకి బాగానే తెలుసు. అందువల్లనే ఆయన నన్ను బాగా ప్రోత్సహించాడు .. వెనకే ఉంటూ నడిపించాడు. అప్పట్లో అప్పులపాలైపోయి .. మధ్యలోనే చదువు ఆపేసిన పరిస్థితి. అప్పులు తీర్చాలంటే .. సంపాదించాలి .. అందుకోసమే హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వెళితే ఏదో ఒక ఉపాధి చూసుకోవచ్చు .. అలాగే అవకాశాల కోసం తిరగొచ్చు అనే ఆలోచనతోనే వచ్చాను" అంటూ చెప్పుకొచ్చాడు.  
getup srinu

More Telugu News