708 మీటర్ల ఎత్తులో 4 గంటల పాటు చిక్కుకుపోయిన పర్యాటకులు!
- రిసార్ట్ ఐలాండ్ గా పేరొందిన లాంగ్ కవీ
- లాంగ్ కవీకి పర్యాటకుల తాకిడి ఎక్కువ
- కేబుల్ కార్ లో చిక్కుకుపోయిన పర్యాటకులు
తొలుత ఎక్కువసేపు ప్రకృతిని వీక్షించవచ్చని సరదా పడిన పర్యాటకులు గంటలు గడుస్తున్నప్పటికీ కేబుల్ కార్లు కదలకపోవడంతో ఆందోళన చెందారు. సుమారు నాలుగు గంటలపాటు 89 మంది ప్రయాణికులు సముద్ర మట్టానికి 708 మీటర్ల ఎత్తులో గాల్లో వేలాడుతూ ఉండిపోయారు. కేబుల్ కార్ లో బేరింగ్ చెడిపోవడంతో అసౌకర్యం కలిగిందని కేబుల్ కార్ నిర్వాహకులు తెలిపారు. వెంటనే మరమ్మతులు పూర్తి చేసి, రాత్రి 9:30 గంటల సమయంలో పర్యాటకులను సురక్షితంగా బేస్ స్టేషన్ కు తీసుకురావడంతో వారంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.