అదో చేదు జ్ఞాపకం .. అన్నం తింటూ ఉండగా బయటికి గెంటేశారు!: 'జబర్దస్త్' నటుడు గెటప్ శీను
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదో చేదు జ్ఞాపకం .. అన్నం తింటూ ఉండగా బయటికి గెంటేశారు!: 'జబర్దస్త్' నటుడు గెటప్ శీను

  • అక్కడ జరిగిన అవమానం మరిచిపోలేను 
  • వారం రోజులపాటు ఏడ్చాను 
  • అక్కడే ఇప్పుడు నా షూటింగ్స్ జరుగుతున్నాయి 
  • ఇంతకి మించిన ఆనందం లేదు
 'జబర్దస్త్' వేదికపై నవ్వులు పూయించే నటుల్లో గెటప్ శ్రీను ఒకరు. గెటప్స్ కి ప్రాధాన్యతనిస్తూ .. పాత్రలో ఒదిగిపోయే ఆయనకి చాలామందే అభిమానులు వున్నారు. అలాంటి శ్రీను తాను ఇంతటి పాప్యులర్ కావడానికి ముందు తనకి ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తాజాగా ప్రస్తావించాడు.

"కెరియర్ తొలినాళ్లలో నేను చాలా కష్టాలు పడ్డాను .. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. 2007లో .. అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడి ప్రొడక్షన్ లో తెలిసిన వ్యక్తి వుంటే .. షూటింగ్ చూద్దామని వెళ్లాను. ఆ వ్యక్తి భోజనం చేయమంటేనే .. అందరితో కలిసి చేస్తున్నాను. ఇంతలో ప్రొడక్షన్ ఇంచార్జ్ అక్కడికి వచ్చాడు. వస్తూనే 'ఎవడ్రా నువ్వు?' అంటూ నాపై మండిపడ్డాడు. నేను చెప్పేది వినిపించుకోకుండా కాలర్ పట్టుకుని బయటికి గెంటేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వారం రోజులు ఏడ్చాను. ఎక్కడి నుంచి గెంటివేయబడ్డానో .. అదే స్టూడియోలో ఇప్పుడు నా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇంతకి మించిన ఆనందం .. గర్వం ఏముంటాయి" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 
getup srinu

More Telugu News