పరుగుల యంత్రం + శతకాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్: ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్
- కోహ్లీ ఆటపై సర్వత్రా ప్రశంసల జల్లు
- దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్
- కోహ్లీ ఆటతీరు అత్యద్భుతం: రషీద్
'పరుగుల యంత్రం + శతకాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్' అని ఆయన పేర్కొన్నాడు. చివరకు అత్యద్భుతమని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టుల్లో ఓడినప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలోనే ఉంది. అంతేకాక, వన్డేల్లో గెలిచి సౌతాఫ్రికాను వెనక్కు నెట్టి అందులోనూ టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియాకు ఘన విజయాలను అందిస్తోన్న కోహ్లీ ప్రతిభపై సర్వత్ర ప్రశంసలు దక్కుతున్నాయి.