తన వీరాభిమాని మృతితో అనూహ్య నిర్ణయం తీసుకున్న లారెన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన వీరాభిమాని మృతితో అనూహ్య నిర్ణయం తీసుకున్న లారెన్స్!

  • నాతో ఫొటో దిగేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు
  • ఈ సంఘటన నన్ను కలచి వేసింది
  • ఇకపై, నాతో ఫొటో దిగేందుకు ఏ అభిమాని రావద్దు
  • నేనే మీ వద్దకు వస్తా: లారెన్స్ ట్వీట్
ప్రముఖ నటుడు, కొరియో గ్రాఫర్  రాఘవ లారెన్స్ తో కలిసి ఫొటో దిగేందుకు శేఖర్ అనే అభిమాని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన తనను ఎంతో కలచి వేసిందని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనతో కలత చెందిన లారెన్స్, తన అభిమానుల కోసం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశాడు.

‘హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్...! నా వీరాభిమాని ఆర్.శేఖర్ నాతో ఫొటో దిగేందుకు తన ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం అందరికీ తెలుసు. అతని అంత్యక్రియల్లో నేను పాల్గొన్నాను. ఈ సంఘటన నన్ను ఎంతో బాధకు గురిచేసింది. ఈ సంఘటనతో నేనో నిర్ణయానికి వచ్చాను. ఇకపై, నాతో కలిసి ఫొటో దిగేందుకు అభిమానులు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అభిమానుల వద్దకే నేను వస్తాను. ఇక నుంచి, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వెళ్లి వారితో కలిసి ఫొటోలు దిగుతాను. ముందుగా ఈ నెల 7న సేలంకు వస్తున్నాను.. శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆ ట్వీట్ లో లారెన్స్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన అభిమాని శేఖర్ ఫొటోను పోస్ట్ చేశాడు.
artist lawrence
chennai

More Telugu News