అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించే ముస్లింలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లిపోండి: యూపీ షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

03-02-2018 Sat 14:02 | National
  • అటువంటి వారికి దేశంలో చోటు లేదు
  • మసీదు పేరుతో జిహాదీ చేసే వారు వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరండి
  • దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ లోని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించే ముస్లింలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు వెళ్లిపోవాలని సూచించారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంపై ఈ నెల 8 నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ప్రార్థన చేసిన అనంతరం రజ్వీ రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ ను కలుసుకున్నారు.

‘‘ఈ సందర్భంగా రజ్వీ మాట్లాడుతూ... ’’అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించే వారు, బాబ్రీ మసీదు నిర్మించాలని కోరుకునే వారు, ఆ తరహా హేతువాద మనస్తత్వం కలిగిన వారు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లిపోవాలి. అటువంటి ముస్లింలకు భారత్ లో చోటు లేదు’’ అని పేర్కొన్నారు. మసీదు పేరుతో జిహాదీని వ్యాప్తి చేసే వారు వెళ్లి ఐఎస్ఐఎస్ దళాల్లో చేరిపోవాలని సూచించారు.

హేతువాద ముస్లిం మత గురువులు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, అటువంటి వారు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిపోవాలని అన్నారు. అయితే, రిజ్వి వ్యాఖ్యలపై షియా మతగురువులు మండిపడ్డారు. ఆయనని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ayodhyaram mandir

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more