ఆసీస్ ఆలౌట్... బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత్ అండర్-19 మెరుపులు!
- 47.2 ఓవర్లకు ఆలౌటైన ఆస్ట్రేలియా అండర్-19
- భారత్ విజయ లక్ష్యం 217 పరుగులు
- సమష్టిగా రాణించిన బౌలర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎడ్వర్డ్స్ (24), బ్రయాంట్ (14), సంఘ (13) లు ఆకట్టుకోగా, మెర్లొ (79), ఉప్పల్ (36) ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనంతరం వచ్చిన స్వీనీ (23) ఫర్వాలేదనిపించాడు. అనంతరం భారత అండర్-19 బౌలర్ల విజృంభణ మొదలైంది. సదర్లాండ్ (5), హాల్ట్ (13), ఇవాన్స్ (1), హాడ్లీ (1) లను త్వరగా పెవిలియన్ కు పంపారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది.