రాజమౌళి మల్టీ స్టారర్‌లో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు రవితేజ, అల్లు అర్జున్ కూడా?
Add ap7am to your home Screen

రాజమౌళి మల్టీ స్టారర్‌లో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు రవితేజ, అల్లు అర్జున్ కూడా?

  • ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రాజమౌళి మల్టీ స్టారర్
  • విలన్ పాత్రలో రవితేజ
  • అల్లు అర్జున్‌కు కీలక పాత్ర
  • ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తున్న వార్తలు
ఎన్టీఆర్, రాం చరణ్‌తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించనున్న మల్టీస్టారర్‌కు సంబంధించి మరో వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు అగ్రహీరోలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరిది ప్రధాన పాత్ర తదితర వాటిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా మరో వార్త ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ సినిమాలో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడన్నదే ఆ వార్త. షూటింగ్ ప్రారంభం కాకముందే హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్నాడన్న వార్తతో మరింత క్రేజ్ సంపాదించుకుందీ చిత్రం.

ఇక, ఎన్టీఆర్, చరణ్‌ సినిమాలో మాస్ మహారాజ రవితేజ విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే రాజమౌళి నుంచి కానీ, ఎన్టీఆర్, చరణ్ వైపు నుంచి కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే రూమర్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఇందులో నటించబోతున్నట్టు తెలియడంతో రాజమౌళి సినిమా టాక్  ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది.
Tollywood
Rajamouli
NTR
Ramcharan
Raviteja
Allu Arjun

More Telugu News