అచ్చొచ్చిన రూమ్ లోనే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న త్రివిక్రమ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అచ్చొచ్చిన రూమ్ లోనే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న త్రివిక్రమ్!

  • పంజాగుట్ట రూమ్ లోనే త్రివిక్రమ్ 
  • అసిస్టెంట్స్ తో స్క్రిప్ట్ పై కసరత్తు 
  • ఎన్టీఆర్ తో హిట్ కొట్టాలనే పట్టుదల  
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి .. రచయితగా నిలదొక్కుకునే రోజుల్లో త్రివిక్రమ్ పంజాగుట్టలోని ఒక రూమ్ లో ఉండేవారు. ఈ రూమ్ లో కూర్చునే ఆయన రెడీ చేసిన కథలకు .. అందించిన మాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సెంటిమెంట్ తోనే ఆ రూమ్ కి అప్పటి నుంచి ఆయన రెంట్ కట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే కూర్చుని ఎన్టీఆర్ సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.

పవన్ తో ఆయన చేసిన 'అజ్ఞాతవాసి' అభిమానులను ఆకట్టుకోలేకపోగా, కాపీ వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఎన్టీఆర్ సినిమాను కూడా 'మధుబాబు' రాసిన ఒక డిటెక్టివ్ నవల ఆధారంగా చేస్తున్నారనే టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ముగ్గురు అసిస్టెంట్స్ తో త్రివిక్రమ్ ఆ రూమ్ లోనే స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడని అంటున్నారు.  
trivikram

More Telugu News