'భాగమతి' సక్సెస్ పట్ల అనుష్క ఆనందం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భాగమతి' సక్సెస్ పట్ల అనుష్క ఆనందం

  • 'భాగమతి' సక్సెస్ సమష్టి కృషి
  • మంచి టీమ్ దొరకడమే అందుకు కారణం 
  • ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు      
అనుష్క ప్రధాన పాత్రగా అశోక్ దర్శకత్వంలో రూపొందిన 'భాగమతి' .. ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా యూనిట్ తో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ఈ వేదికపై అనుష్క మాట్లాడుతూ .. "భాగమతి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను బాగా చేస్తానంటూ అంతా నన్ను అభినందిస్తుంటారు. నిజానికి ఇది సమష్టి కృషి ..  మంచి టీమ్ కుదరడం వల్లనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి. ఇదే విషయాన్ని 'భాగమతి' మరోసారి నిరూపించింది. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ .. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్" అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.     
anushka

More Telugu News