బాలయ్యను ఇబ్బంది పెడుతున్న భుజం గాయం.. త్వరలో సర్జరీ.. నాలుగు నెలల విశ్రాంతి!
Add ap7am to your home Screen

బాలయ్యను ఇబ్బంది పెడుతున్న భుజం గాయం.. త్వరలో సర్జరీ.. నాలుగు నెలల విశ్రాంతి!

  • షూటింగ్‌లో గాయపడిన బాలయ్య
  • తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న భుజం గాయం
  • సర్జరీ చేయించుకోవాలని సూచించిన వైద్యులు
  • తర్జన భర్జన పడుతున్న నందమూరి నటసింహం
ఎనిమిది నెలల క్రితం షూటింగ్‌లో గాయపడిన నందమూరి నటసింహం బాలకృష్ణ గాయాన్ని లెక్క చేయకుండా పలు సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్నారు. ఇప్పుడా గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ అవసరమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. షూటింగ్ సమయంలో భుజానికి అయిన గాయం అలాగే ఉందని, సర్జరీ చేయించుకోక తప్పదని బాలయ్య బాబుకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. శస్త్రచికిత్స తర్వాత నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

శస్త్రచికిత్సకు ఓకే అన్న బాలయ్య, నాలుగు నెలలు విశ్రాంతి అంటే కష్టమని వైద్యులతో చెప్పారట.   ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని అనుకున్న సమయంలో పూర్తిచేయాలని భావిస్తున్న ఆయన, ఆపరేషన్ విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టు టాలీవుడ్ టాక్. కుటుంబ సభ్యులు మాత్రం వెంటనే సర్జరీ చేయించుకోమని చెబుతున్నారట. అయితే బాలకృష్ణ నిర్ణయం ఏంటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య తాజా చిత్రం ‘జై సింహా’ మంచి టాక్ సంపాదించుకుంది.
Tollywood
Balakrishna
Actor
surgery

More Telugu News