తెలుగు రాష్ట్రాల్లో 'భాగమతి' తొలిరోజు వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో 'భాగమతి' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'భాగమతి'
  • నైజామ్ లో తొలి రోజున భారీ వసూళ్లు 
  • అనుష్కకి గల క్రేజ్ ప్రధాన కారణం   
అందం .. అభినయం కలగలిసిన కథానాయికగా అనుష్క అభిమానులు ఆమె పేరు చెబుతారు. అలాంటి అనుష్క తాజా చిత్రంగా 'భాగమతి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బలమైన కథతో .. విభిన్నమైన కథనంతో ఈ సినిమా తొలిరోజునే మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. తొలి రోజున ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను సాధించింది.

 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా చూసుకుంటే, నైజామ్ లో 2.10 కోట్లు .. సీడెడ్ లో 75 లక్షలు ..  ఉత్తరాంధ్ర 70 లక్షలు .. గుంటూరులో 60 లక్షలు ..  ఈస్ట్ 40 లక్షలు .. వెస్ట్ 30 లక్షలు .. కృష్ణా 38 లక్షలు .. నెల్లూరు 27 లక్షలు వసూలు చేసింది. ఇలా తొలిరోజున ఈ సినిమా 5.50 కోట్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. అనుష్కకి గల క్రేజ్ కారణంగా .. భారీ ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ లభించాయని అంటున్నారు.    
anushka

More Telugu News