రాజేష్ మగాడు కాదు: శైలజ తండ్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజేష్ మగాడు కాదు: శైలజ తండ్రి

  • డాక్టర్ రిపోర్టులు సరైనవి కాదు
  • ప్రలోభాలకు గురి చేసి, రిపోర్ట్ తెప్పించుకున్నారు
  • కేసు నుంచి తప్పుకోం
లైంగిక పటుత్వ పరీక్షలో శాడిస్ట్ భర్త రాజేష్ కు అనుకూలంగా నివేదిక రావడంతో, అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలు శైలజ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ కుమార్తెను రాజేష్ చేతిలో పెడితే... తొలి రాత్రే నరకం చూపించాడని బాధను వ్యక్తం చేశారు. డాక్టర్లను ప్రలోభాలకు గురి చేసి...  పటుత్వ పరీక్షల్లో రాజేష్ నెగ్గి ఉండవచ్చని ఆయన అన్నారు.

డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును తాము నమ్మబోమని... సంసారానికి పనికిరానంటూ తమ కూతురితో రాజేష్ స్వయంగా చెప్పాడని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని తన కుమార్తెతో ప్రామిస్ చేయించుకున్నాడని చెప్పారు. ఇలాంటి వ్యక్తిని మగాడు అంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. రాజేష్ పై పెట్టిన గృహ హింస కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
rajesh
sailaja case

More Telugu News