ఆ సినిమా సమయంలో నన్ను బాగా ఆటపట్టించే వాళ్లు: హరిప్రియ
- నేను తెలుగు మాట్లాడుతుంటే కన్నడ యాస ఉండేది
- అందరూ ఆటపట్టించేవాళ్లు
- ఆ తరువాత తెలుగు నేర్చుకున్నాను
"మొదటి నుంచి కూడా నేను పెరిగిన వాతావరణంలో తెలుగుపై కన్నడ ప్రభావం ఉంటూ ఉండేది. 'తకిట తకిట' సినిమా సమయంలో కన్నడ యాసతో కూడిన తెలుగు మాట్లాడుతుంటే, ఇక్కడ అంతా ఆటపట్టించేవాళ్లు. ఆ పదానికి అర్థం చెప్పు .. ఈ పదానికి అర్థం చెప్పు అంటూ తప్పులు పట్టుకుంటూ టీజ్ చేస్తుండే వాళ్లు. ఆ తరువాత నేను తెలుగు నేర్చుకున్నాను .. ఇప్పుడు నాకెంతో సంతోషంగా వుంది" అని చెప్పింది.