థియేటర్లు తగలబెడితే మీరే నష్టపోతారు.. 'పద్మావత్‌'పై రాజాసింగ్‌ ఫైర్‌

  • న్యాయస్థానానికి అసత్యాలు చెప్పారు
  • ఇటువంటి సినిమా తీసేవారికి సరైన సమాధానం ఇవ్వాలి
  • ఈ సినిమాను చూడొద్దు
  • వారు నష్టపోతే మరోసారి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయబోరు
ఈ నెల 25న విడుదలవుతోన్న 'పద్మావత్' సినిమాపై హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ మండిపడ్డారు. పద్మావతి పేరును 'పద్మావత్‌'గా మార్చేసి, అసలు ఈ సినిమా వల్ల ఎటువంటి సమస్య ఉండదని, కొంత మంది కావాలనే వివాదాన్ని రేపుతున్నారని ఆ సినిమా బృందం న్యాయస్థానానికి తప్పుడు పత్రాలు ఇచ్చిందని రాజాసింగ్ ఆరోపించారు.

ఇటువంటి సినిమాలు తీసేవారికి సరైన సమాధానం ఇవ్వాలంటే మనం ఈ సినిమాను చూడొద్దని, వారు నష్టపోతే మరోసారి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయబోరని అన్నారు. థియేటర్లు తగలబెడితే మీరే నష్టపోతారని తాము ఇప్పటికే పలువురికి చెప్పామని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
raja singh
theatre
Hyderabad
padmavat

More Telugu News