పారితోషికం సంగతి తరువాత అంటోన్న అంజలి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికం సంగతి తరువాత అంటోన్న అంజలి!

  • తెలుగు సినిమాలపై శ్రద్ధ పెట్టిన అంజలి 
  • అవకాశాల కోసం ప్రయత్నాలు 
  • హిట్ అయితేనే పారితోషికం ఇవ్వమంటూ సంకేతాలు  
తెలుగులో కథానాయికగా అంజలికి మంచి గుర్తింపు వుంది. ఆ మధ్య తెలుగులో వరుస సినిమాలు చేసిన అంజలి, ఆ తరువాత నుంచి పెద్దగా కనిపించడం లేదు. కష్టపడి కసరత్తు చేసి .. నాజూకుగా మారినా అవకాశాలు ఆమెను పలకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళ .. మలయాళ భాషా చిత్రాలపైనే దృష్టి పెట్టింది.

అంతేకాదు తెలుగు సినిమాలను పూర్తిగా పక్కన పెట్టడం కూడా మంచిది కాదని భావించి, టాలీవుడ్ దర్శక నిర్మాతలకు కూడా టచ్ లోనే వుంటోందట. అంతేకాదు ముందుగా ఛాన్స్ ఇవ్వండి చాలు .. పారితోషికం సంగతి తరువాత అని చెబుతోందట. సినిమా హిట్ అయితేనే పారితోషికం ఇవ్వండి అనే సంకేతాలు పంపుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఉత్సాహాన్ని చూపుతున్నట్టు సమాచారం. 
anjali

More Telugu News