నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్న పాండ్యా.. క్షమించరాని నేరమన్న గవాస్కర్

16-01-2018 Tue 07:49 | Sports
  • సింగిల్ కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకున్న పాండ్యా
  • క్రీజులోకి వచ్చినా బ్యాట్ మోపడంలో విఫలం
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ అయిన పాండ్యాపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అయితే పాండ్యా క్షమించరాని నేరం చేశాడని వ్యాఖ్యానించాడు. అంతగా విమర్శల పాలవుతున్న పాండ్యా చేసిందేమిటంటే..

కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్ సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. దీంతో సెంచూరియన్ టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే భారత్ వరస విజయాలకు బ్రేక్ పడుతుంది. వికెట్లన్నీ టపటపా కోల్పోతున్న వేళ సంయమనంతో ఆడాల్సిన పాండ్యా ఉత్త పుణ్యానికే వికెట్ సమర్పించుకున్నాడు.

ఇన్నింగ్స్ 68వ ఓవర్‌లో రబడా వేసిన తొలి బంతికి పాండ్యా  సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఫిలాండర్ చేతుల్లోకి వెళ్లింది. గమనించిన పాండ్యా పరుగు తీయకుండా తిరిగి వెనక్కి వచ్చాడు. అదే సమయంలో చేతికి అందిన బంతిని ఫిలాండర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నేరుగా వికెట్ల వైపు విసిరి గిరాటేశాడు. బంతి వికెట్లను తాకడానికి ముందే పాండ్యా క్రీజులోకి చేరుకున్నాడు. అయితే బ్యాట్ కానీ, పాదం కానీ క్రీజులో మోపకపోవడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. క్రీజులోకి చేరుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే హార్ధిక్ ఔటయ్యాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కెప్టెన్ కోహ్లీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Harik pandyaTeam IndiaSunil GavaskarVirat Kohli

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more