సంబరమంతా చిత్తూరుదే... ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ వైపు చంద్రబాబు, మరో వైపు జగన్!
- నారావారి పల్లెలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్యామిలీస్
- అక్కడికి దగ్గరగానే వైకాపా అధినేత జగన్
- భోగి మంటలు వేసి సంక్రాంతికి ఆహ్వానం
ఈ ఉదయం జగన్ కూడా భోగి వేడుకల్లో పాల్గొని తనను అభినందించేందుకు వచ్చిన అభిమానులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విలేజ్ టూరిజానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఇటువంటి పండుగలను మరింత పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా, నారావారి పల్లెకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని పుల్లయ్యగారెల్ల గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే రోజా భోగి మంటలు వేసి ఆడి పాడారు. రేపు సంక్రాంతిని జరుపుకోనున్నామని, కనుమ రోజు రంగంపేట పరిసరాల్లో జల్లికట్టును వైభవంగా నిర్వహిస్తామని రోజా తెలిపారు.