త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడిపోయాడట!
Add ap7am to your home Screen

త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడిపోయాడట!

  • ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ 
  • బాగా కసరత్తు చేసిన ఎన్టీఆర్ 
  • సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం?  
'జై లవ కుశ' సినిమా తర్వాత, తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తోనే చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి.

పాత్రకు తగ్గట్టుగా చాలా వరకూ బరువు తగ్గాలని త్రివిక్రమ్ చెప్పడంతో, ఆహార నియమాలు పాటిస్తూ ఫారిన్ నిపుణుడి పర్యవేక్షణలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ను చూసినవాళ్లు 'ఇంతలోనే ఇంత మార్పా?' అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారట. ఎన్టీఆర్ అంతగా సన్నబడిపోయాడని అంటున్నారు. త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీగా వున్నాడన్నమాట. ఇక 'అజ్ఞాతవాసి'కి వచ్చిన టాక్ వలన ఆలోచనలో పడిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం తీసుకోవచ్చన్నది తాజా వార్త.        
trivikram
ntr

More Telugu News